ఎస్పీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): 76వ భారత గణతంత్ర దినోత్సవం(76th Republic Day of India) సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(SP Rohit Raju) జాతీయ పతాకాన్ని(National Flag) ఆవిష్కరించారు. జిల్లా ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బందికి 76వ గణతంత్ర దినోత్సవ(Republic Day) శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ... రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ స్వేచ్చ, స్వాతంత్య్రల వెనక ఎంతో మంది పోరాటయోదుల త్యాగం దాగి ఉన్నదని గుర్తు చేశారు. మన వంతు భాద్యతగా దేశసేవ కొరకు పాటుపడాలని, పోలీసు అధికారులు సిబ్బంది తమ విధులను భాద్యతాయుతంగా నిర్వహించి పోలీస్ వ్యవస్థకు మంచి పేరు, ప్రతిష్టలు తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్ ఐపిఎస్, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి, ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు, శ్రీనివాస్, జిల్లా కార్యాలయ ఏఓ మంజ్యా నాయక్, ఆర్ఐలు, సీఐలు, ఎస్సైలు, జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ మరియు ఓఎస్డి కార్యాలయం నందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అడిషనల్ ఎస్పీ పరితోష్ పంకజ్ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హేమచంద్రపురం నందుగల జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు మరియు ఓఎస్డి కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్ జాతీయ జెండాను ఆవిష్కరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు(Happy Republic Day) తెలియజేశారు.