calender_icon.png 29 January, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హార్వెస్ట్‌లో ఘనంగా రిపబ్లిక్ డే

27-01-2025 12:56:11 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 (విజయక్రాంతి): హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. హార్వెస్ట్ గ్రూప్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పీ రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతీరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. కేరళ రాష్ర్టంలో ఎన్‌సీసీ జాతీయ స్థాయి ట్రెక్కింగ్ క్యాంప్‌లో పాల్గొన్న కే మణిదీప్‌రెడ్డి, పీ మహేందర్‌రెడ్డిలతో పాటు ఏఎన్‌ఓ బాలకృష్ణను అభినందించారు. వైస్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, హార్వెస్ట్ జూనియర్ కళాశాల అకడమిక్ హెడ్ మీనన్‌రెడ్డి, సెంటర్ హెడ్ నరసింహారావు, ఉపాధ్యాయులు వీఎస్‌ఎన్ మూర్తి, ప్రైమరీ హెచ్‌ఎం మానస, అకడమిక్ ఇన్‌చార్జిలు శ్యామల, ఉమామహేశ్వరరావు, నాగరాజు, జాకీర్ పాల్గొన్నారు.