మంచిర్యాల (విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నస్కూర్ మున్సిపాలిటీలోని తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాల వేసి, బిఆర్ఎస్ జెండా గద్దె వద్ద జాతీయ జెండాను మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు ఎగురవేశారు. అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియా, వాటర్ ట్యాంక్ ఏరియా, మున్సిపాలిటీ వెనకాల జెండా ఎగరవేశారు. ఈయన వెంట బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మంచిర్యాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పెంట రాజయ్య, నస్పూర్ మండల పార్టీ అధ్యక్షులు అక్కురి సుబ్బన్న, సెక్రటరీ మెరుగు పవన్, కౌన్సిలర్లు అంకం నరేష్, శ్రీరాముల సుజాత మల్లేష్, ఆఫీసా బేగం సుంకరి శ్వేత రమేష్, వంగ తిరుపతి, బేర సత్యనారాయణ, అహ్మద్, కుర్మిళ్ళ అన్నపూర్ణ, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.