26-01-2025 04:50:28 PM
మంచిర్యాల (విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు మిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇనిస్ట్యూషన్స్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల పట్టణ వీధులలో రాజ్యాంగ స్ఫూర్తిని తెలిపే విధంగా వివిధ రకాలైన వేషధారణలతో విద్యార్ధులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మిమ్స్ డిగ్రీ కళాశాల ఎన్ సిసి విద్యార్ధులు, జూనియర్ కళాశాల, మిమ్స్ ప్రైమ్, మిమ్స్ హైస్కూల్ విద్యార్ధులు వివిధ రకాల వేషధారణలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మిమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ శ్రీనివాసరాజు, ఉపేందర్ రెడ్డి, డైరక్టర్లు దేవేందర్ రావు, శ్రీధర్ రాజు, విజయకుమార్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శైలజ, పాఠశాల ప్రిన్సిపల్ సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.