భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం మున్సిపాలిటీలో గత నెల మున్సిపల్ పాలకవర్గం గడువు ముగిసినప్పటికీ అనేక వార్డులలో మున్సిపల్ కార్మికులు ఆయా మాజీ ప్రజాప్రతినిధుల ఇండ్లలో పని చేస్తుండడం బాధాకరమని సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ అన్నారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో మున్సిపల్ వర్కర్స్ ను వార్డులలో ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలని ఇన్చార్జి వార్డు ఆఫీసర్స్ ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.
ఇన్చార్జి వార్డ్ ఆఫీసర్స్, సంబంధిత మున్సిపల్ అధికారులు మాజీ ప్రజా ప్రతినిధుల మీద ప్రతి అవసరానికి సలహాలు సూచనలకు ఆధారపడకుండా అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజలతో ప్రభుత్వ అధికారులు నేరుగా సంబంధాలు కొనసాగించాలని అప్పుడే సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించబడతాయని అధికారుల దృష్టికి వస్తాయని ఆయన తెలిపారు. మున్సిపల్ వర్కర్లను ప్రజా అవసరాలకు కాకుండా మాజీల ఇండ్లలో అవసరాలు తీర్చేందుకు ఎక్కడ కనిపించిన అలా తమ దృష్టికి వచ్చిన ఊరుకునేది లేదని దీనిపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.