calender_icon.png 19 March, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేఅవుట్లు, ప్లాట్ల అనుమతులకు నివేదికలు సమర్పించాలి

18-03-2025 07:54:22 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్...

కామారెడ్డి (విజయక్రాంతి): లే అవుట్లు, ప్లాట్ల అనుమతులకు సంబంధిత శాఖల అధికారుల నివేదికలు స్పష్టంగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో తెలంగాణ బి-పాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో లే అవుట్లు, ప్లాట్ల అనుమతులకు ఆయా శాఖల అధికారుల నివేదికలను సమర్పించాలని అన్నారు. ఆయా లే అవుట్లు సంబంధిత అధికారులు పరిశీలించి పూర్తి నివేదికలు అందజేయాలని తెలిపారు.

రెవిన్యూ, విద్యుత్, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్, నీటిపారుదల, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ తదితర శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రావణ్ కుమార్, పంచాయతీ రాజ్ ఈఈ దుర్గా ప్రసాద్, రోడ్లు భవనాల శాఖ ఈఈ రవి శంకర్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, డిటిసిపిఓ సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.