calender_icon.png 25 April, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో ఓ ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేసిన రిపోర్టర్

24-04-2025 11:13:04 PM

ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు రిపోర్టర్ పై కేసు నమోదు..

కామారెడ్డి (విజయక్రాంతి): ఎమ్మెల్యేని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన ఓ విలేకరిపై కేసు నమోదు అయిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే తన అరాచకాలను బయటపెడతానని తన వద్ద ప్రూఫ్స్ ఉన్నాయని డబ్బులు ఇస్తే వాటిని ప్రసారం చేయనని డబ్బులు డిమాండ్ చేయడంతో సదరు విలేకరిపై ఎమ్మెల్యే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్న ఛానల్ లో పనిచేస్తున్న ఓ రిపోర్టర్ ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ కు పాల్పడడంతో ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఏ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేశారని కలకలం రేపుతుంది.