calender_icon.png 29 November, 2024 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసతి గృహాల్లో సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక

29-11-2024 02:00:51 AM

    1. రాష్ట విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
  1. సంగారెడ్డి జిల్లాలోని వసతిగృహాల్లో తనిఖీలు

సంగారెడ్డి, నవంబర్ 28 (విజయక్రాంతి):  వసతి గృహాల్లో ఉండే ఆడపిల్లలు అధైర్యపడద్దని.. ఇక్కడ అన్ని వసతులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వానిన కోరుతామని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు కొండాపూర్‌లోని కేజీబీవీ పాఠశాలను, మల్లెపల్లిలోని సాంఘీక సంక్షేమ బాలికల వసతి గృహం, సంగారెడ్డి హాస్టల్, ఇంటిగ్రేటేడ్ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలసి ఆయన తనిఖీ చేశారు.

ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలసి భోజనం చేశారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహంలో వంట గదులు, స్టోర్‌రూమ్‌లు, డైనింగ్ హాల్, మూత్రశాలలు, మరుగుదొడ్లను వారు పరిశీలించారు. విద్యార్థుల కు మోను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీ పాఠశాలల్లో భోజనం తయారు కోసం వినియో గించే కారంపొడి, అల్లం, వెల్లుల్లిపేస్టు, పసుపు, గరం మసాలా, సాంబార్ పౌడర్ లాంటి పొడులను రెడీమేడ్‌వి వాడవద్దన్నారు.

పాఠశాలలో తయారు చేసుకొని వంటలో వేసుకోవాలన్నారు. పది రోజుల పాటు రాష్ట్రంలో ఉన్న సంక్షేమ వసతి గృహాలను, కేజీబీవీ పాఠశాలలను తనిఖీ చేస్తామన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయలు కల్పించేందుకు చర్య లు తీసుకోవాలని అధికారు లను ఆదేశించారు. విద్యార్థుల సమస్యల పై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. కలెక్టర్ క్రాంతి వల్లూరు, జిల్లా విద్యా శాఖ అధికారి వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.