హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24(విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో నెలకొన్న సమస్యలపై విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి ఓయూ అధికారులు నివేదిక అందజేశారు. మంగళవారం ఓయూ అధికారులతో ముర ళి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మౌలిక వసతుల కల్పన, ఆర్థిక వనరులు, అడ్మిషన్లు, మెస్ బకాయిలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, పరిశోధన, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీ అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ విద్యార్థులు, యువత నైపుణ్యాల ద్వారా నే మెరుగైన ఆవిష్కరణలు సృష్టించడం సాధ్యమన్నారు. అకడమిక్ కరికులంతో పాటు నైపుణ్యాల శిక్షణను ప్రారంభించాలన్నారు. సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.