calender_icon.png 22 February, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రికార్డులు పరిశీలించి లోకాయుక్తకు నివేదిక

21-02-2025 12:32:36 AM

వనపర్తి, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): జిల్లాలోని కొత్తకోట మండల పరిధిలోని రాయినిపేట రాయసముద్రం చెరువుకు సంబంధించి అన్ని రికార్డులు పరిశీలించిన తర్వాత లోకాయుక్తకు పూర్తి నివేదిక సమర్పిస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కొత్తకోట మండల పరిధిలోని రాయినిపేట చెరువు నీటి వల్ల తమ భూము లు మునుగుతున్నాయని, మునిగిన తమ భూములకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలంటూ చెరువు ఆయకట్టు రైతులు ఇదివరకు లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో లోకయుక్త కు నివేదిక సమర్పించడం కొరకు జిల్లా కలెక్టర్ గురువారం నాడు అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి చెరువు పరిసరాలను పరిశీ లించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అక్కడికి వచ్చిన రాయిని పేట, వనపర్తి మండలంలోని కడుకుంట్ల గ్రామాల రైతులతో మాట్లాడి, పరిస్థితులను తెలుసుకు న్నారు. చెరువు నీటి వల్ల మునుగుతున్న తమ భూముల సమస్య గురించి రైతులు కలెక్టర్ కు విన్నవించారు.  ఇరిగేషన్ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, వనపర్తి తాసిల్దార్ రమేష్ రెడ్డి,  కొత్తకోట తహసిల్దార్ శ్రీనివాసులు, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.