calender_icon.png 31 October, 2024 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భోజ్‌శాల కాంప్లెక్స్‌పై హైకోర్టుకు నివేదిక

16-07-2024 02:17:47 AM

  • మూడు నెలలుగా ఆర్కియాలజికల్ అధికారుల సర్వే 
  • బయటపడ్డ వివిధ కాలాలకు చెందిన పురాతణ నాణేలు 
  • జూలై 22కు విచారణ వాయిదా

భోపాల్, జూలై 15: మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజ్‌శాల కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్‌పై చేసిన శాస్త్రీయ సర్వే నివేదికను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ఆ రాష్ట్ర హైకోర్టులోని ఇండోర్ బెంచ్‌కు సోమవారం సమర్పించింది. ఏఎస్‌ఐ తరపు న్యాయవాది హిమాన్షు జోషి 2000 పేజీల నివేదికను హైకోర్టు రిజిస్ట్రీకి సమర్పించారు. జూలై 22న విచారణ జరుపుతామని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ సర్వేలో వివిధ కాలాలకు చెందిన వెండి, రాగి, అల్యూమినియం, ఉక్కుతో తయారు చేసిన మొత్తం 31 నాణేలు దొరికాయని నివేదికలో పేర్కొన్నారు.

ఈ సర్వేలో మొత్తం 94 శిల్పాలు, శకలాలు, నిర్మాణ అంశాలు కూ డా బయటపడ్డాయి. ఈ శిల్పాలు బసాల్ట్, పాలరాయి, స్కిస్ట్, మృదువైన రాయి, ఇసుకరాయి, సున్నపురాయితో తయారు చేయ బడ్డాయి. వీటిపై గణపతి, బ్రహ్మ, నరసింహ, బైరవ తదితర దేవుళ్ల బొమ్మలు, సింహాలు, ఏనుగులు, గుర్రాలు, కుక్కలు, కోతులు, పాములు, తాబేళ్లు, హంసలు, పక్షులు వంటి బొమ్మలు చెక్కబడి ఉన్నాయి.

హిందువులు, ముస్లింల మధ్య వివాదం..

వివాదాస్పద 11వ శతాబ్దపు భోజ్‌శాల కాంప్లెక్స్‌లోని స్మారక చిహ్నం విషయంలో హిందువులు, ముస్లింల మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఏఎస్‌ఐ నివేదిక ప్రకారం, భోజ్‌శాల ఒకప్పుడు ఒక ముఖ్యమైన విద్యా కేంద్రంగా ఉండేది. దీన్ని భోజ్ అనే రాజు స్థాపించాడు.