మణుగూరు: అనుమానిత వ్యక్తుల సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు కోరారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో ప్రధాన రహదారిపై పలుచోట్ల విస్తృత తనిఖీలు చేపట్టారు. అనంతరం టీ కొత్తగూడెం జానంపేట, రావి గూడెం, చింతల బయ్యారం గ్రామంలో గల గోదావరి వద్ద నావ నడిపే వారితో మాట్లాడి సమాచారం సేకరించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
తమ గ్రామాల్లో, కాలనీలలో ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే సమాచారం ఇవ్వాలన్నారు. శాంతిభద్రతలే లక్షంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలిపారు. కొత్తవారు అద్దెకు వచ్చిన పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఏవైనా సమస్యలున్నా తమదృష్టికి తీసుకరావాలని లేదా 100కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్ లకు, వాట్సాప్ కాల్స్ కు స్పందించవద్దని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ బయ్యారం ఎస్సై రాజ్ కుమార్, పోలీస్ సిబ్బంది, సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.