calender_icon.png 26 December, 2024 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతి తర్వాతే నివేదిక?

26-12-2024 01:34:44 AM

  1. కులగణన డాటా ఎంట్రీలో జాప్యమే కారణం
  2. ఈ నెలాఖరులోగా కంప్యూటరీకరణ పూర్తి! 
  3. జనవరి మొదటి వారంలో డెడికేటెడ్ కమిషన్‌కు రిపోర్టు
  4. నివేదిక ఆధారంగానే ‘స్థానిక’ ఎన్నికల్లో రిజర్వేషన్లు
  5. అసెంబ్లీ సమావేశాల్లోనూ స్పష్టం చేసిన సర్కారు
  6. 42 శాతం అమలుపై బీసీల్లో నెలకొన్న ఉత్కంఠ

హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలోని బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధిపరంగా తగిన గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగానే స్థానిక సంస్థ ల్లో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని సర్కారు ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్నది.

వాస్తవానికి బీసీలు రాజకీయంగా ఎదగాలం టే వారికి జనాభా ప్రకారం హక్కులు కల్పించాలి. ఈ విషయాన్ని ప్రాధాన్యతా అంశంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కులగణన ప్రక్రియను ప్రారంభించింది. ఈ నివేదిక ఆధా రంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది.

ఈ కమిషన్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా బహిరంగ విచారణను కూడా పూర్తి చేసింది. జనవరి 15వ తేదీ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో డెడికేటెడ్ కమిషన్ నివేది క ప్రాధాన్యతను సంతరించుకున్నది. 

నెలాఖరు కల్లా డాటా ఎంట్రీ పూర్తి..

రాష్ట్రవ్యాప్తంగా డెడికేటెడ్ కమిషన్ చేపట్టి న బహిరంగ విచారణ పూర్తి అయినప్పటికీ ప్రభుత్వానికి అందజేసే నివేదిక ఇంకా తయారు కాలేదు. ప్రణాళిక శాఖ నుంచి రావాల్సిన కులగణన నివేదిక సరైన సమయానికి అందకపోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

అయితే కులగణన వివరాల కంప్యూటరీకరణ ఈ నెలాఖరు కల్లా పూర్తి కానున్నదని, జనవరి మొదటి వారంలో డెడికేటెడ్ కమిషన్‌కు నివేదిక సమర్పించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంప్యూటరీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్టు సమాచారం.

అయితే కులగణన వివరాలు అందిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించే నివేదికను రూపొందిం చేందుకు మరో రెండు వారాల సమయం పడుతుందని కమిషన్ చైర్మన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనవరి మొదటి వారంలో డెడికేటెడ్ కమిషన్‌కు కులగణన వివరాల అందనుండటంతో సంక్రాంతి తర్వాతే కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బీసీలు..

జనవరి ౧౫ తర్వాత ‘స్థానిక’ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తుండటంతో బీసీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆ లోగా ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికను సమర్పి స్తుందో.. లేదోనని బీసీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ప్రభు త్వం నిర్దేశించిన 60 రోజుల గడువులోగా సమగ్ర కుటుం బ సర్వే పూర్తి కాలేదు.

దీంతో డెడికేటెడ్ కమిషన్‌కు ప్రణాళిక శాఖ అధికారులు నివేదికను సమర్పించలేకపోయారు. ఈ నేపథ్యంలో డెడికేటెడ్ కమిషన్ నివేదిక గడువులోగా ప్రభుత్వానికి అందడంతోపా టు వారి రిజర్వేషన్ల పెంపుపై సానుకూల ఫలితం వస్తుందని బీసీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

‘డెడికేటెడ్’కు అందని నివేదిక..

ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించింది. గ్రామీణ జిల్లాల్లో సర్వే వేగంగా పూర్తయినా పట్టణాల్లో కాస్త ఆలస్యమైనా.. అంతటా సర్వే విజయవంతంగా పూర్తి చేసింది. అనంతరం డాటా ఎంట్రీ కూడా ప్రారంభమైనా.. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా (నవంబర్ 30) పూర్తి కాకపోగా..

ఇప్పటికీ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సర్వే బాధ్యత నిర్వర్తిస్తున్న ప్రణాళిక శాఖ మొత్తం ప్రక్రియ పూర్తయి న తర్వాత నివేదికను డెడికేటెడ్ కమిషన్ కు అందించాల్సి ఉంది. అయితే ఇప్పటికీ ఆ నివేదిక డెడికేటెడ్ కమిషన్‌కు అందలేదని అధికారులు చెబుతున్నారు. 

కమిషన్ నివేదిక ఆధారంగానే..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నా హైకోర్టు తీర్పు తో డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రాధాన్యతను సంతరించుకున్నది. కమిషన్ నివే దిక ఆధారంగానే బీసీల రిజర్వేషన్ల అం శానికి తెరపడనున్నది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్, పురపాలక సవరణ బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం స్పం దిస్తూ.. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లపై నిర్ణయం ఉంటుందని స్పష్టతనిచ్చింది. ఈ నేపథ్యంలో డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఎంతో కీలకంగా మారనున్నది.