- సీఎస్, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
- లగచర్లకు కమిషన్ అధికారుల బృందం
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): లగచర్ల ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ జితేందర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈఘటనపై రెండు వారాల్లో పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది.
తమ అధికారుల బృందాన్ని లగచర్లకు పంపాలని కూడా నిర్ణయించింది. ఫార్మా కంపెనీ భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 18న ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ గురువారం నోటీసులు జారీ చేసింది.
ఫలించిన బీఆర్‌ఎస్ పోరాటం..
లగచర్ల ఘటనలో బాధిత రైతు కుటుంబాలకు బీఆర్‌ఎస్ అండగా నిలిచింది. కేటీఆ ర్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయికి తీసుకెళ్లి బాధితుల గొంతుకను వినిపించారు. బీఆర్‌ఎస్ పోరాట ఫలితంగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆ కేసును సుమోటోగా స్వీకరించి రెండు వారా ల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. దీంతో బీఆర్‌ఎస్ నేత లు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అరాచకాలపై పోరాడతామని, పేదలకు అన్యాయం చేస్తే సహించమని వారు పేర్కొన్నారు.