మహబూబ్ నగర్, జనవరి 29 (విజయ క్రాంతి): వార్డ్ ఆఫీసర్లు వారికి కేటాయించిన వార్డులలో పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని భూత్పూ ర్, మహబూబ్ నగర్, జడ్చర్ల మున్సిపల్ అధికారులతో మాట్లాడారు.
తమ పరిధి లో ని అక్రమ కట్టడాలను పూర్తిస్థాయిలో అవ గాహన కలిగి ఉండాలని, ఎలాంటి అక్రమ కట్టడాలు జరిగిన సమాచారం టౌన్ ప్లానిం గ్ అధికారులకు చేరవేయలని ఆదేశిం చారు. విధుల పట్ల నిర్లక్ష్య వహించకూడదని ప్రజల కు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారికి నెలకొన్న సమస్యలను పరిష్కరిం చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.