రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (విజయక్రాంతి) : లోన్‌యాప్ నిర్వాహకులు వేధిస్తే వెంటనే డయల్ 100 లేదా 1930కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మధ్య కాలంలో లోన్‌యాప్ నిర్వాహకుల ఒత్తిడి భరించలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
డబ్బులు చెల్లించకపోతే బాధితుల ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారన్నారు. దీంతో మీకు మేమున్నామని బాధితులకు రాచకొండ పోలీసులు భరోసా కల్పిస్తుమని, ఎవరైనా ధైర్యంగా పోలీసులను ఆశ్రయించవచ్చన్నారు.