calender_icon.png 31 October, 2024 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు

17-07-2024 06:45:47 AM

ఉచిత ఇసుక పాలసీని ఆమోదిస్తూ క్యాబినెట్ తీర్మానం

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దు చేస్తూ ఏపీ క్యాబినెట్ తీర్మానం చేసింది. మం గళవారం సచివాలయంలో సీఎం చంద్రబా బు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలు సు పార్థసారథి మీడియాకు వివరించారు. నీతి ఆయోగ్ రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ అధికారి మాత్రమే టీఆర్‌వోగా ఉండాలి, కానీ ఆ స్థానంలో గత ప్రభుత్వం అర్హత లేని వ్యక్తులను సైతం కూర్చోబెట్టేలా మార్పులు చేసిం దన్నారు.

ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం ద్వారా రిజిస్ట్రేషన్ పొందిన భూయజమానికి జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారని, ఒరిజినల్ డాక్యుమెంట్స్ సదరు టీఆర్‌వో వద్దే ఉంటాయని, దీంతో ప్రభుత్వం సదరు ఆస్తులను తనఖా పెట్టుకునే అవకాశం ఉందని భూయజమానులు భయాందోళనకు గురైనట్లు గుర్తుచేశారు.

మరోవైపు, వైసీపీ ప్రభు త్వం తీసుకొచ్చిన గనుల పాలసీ ఇసుక పాలసీ రద్దుచేస్తూ, త్వరలోనే ఉచిత ఇసుక విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ పాలసీ ఏర్పా టు అయ్యేంతవరకు ప్రజలకు ఉచితంగా ఇసుక అందించే మధ్యంతర వ్యవస్థ కోసం తీసుకొచ్చిన జీవో 43కు క్యాబినెట్ ఆమో దం తెలిపిందన్నారు. ఇప్పటివరకు ఆయా సంస్థలతో ఉన్న ఒప్పందాలను నిలుపుదల చేసి, ఇసుక స్టాక్‌లను సంబంధిత అధికారులకు అప్పగించాలని మైన్స్ అండ్ జియా లజీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. శాండ్, మైనింగ్ పాలసీ మరింత మెరుగైన ఇసుక పాలసీ 2021లను క్షుణ్ణంగా అధ్యయనం చేసి సమగ్ర ఇసుక విధానం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.  

22 నుంచి అసెంబ్లీ సమావేశాలు

నూతన ఇసుక పాలసీలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు సూచించారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. బోట్ సొసైటీలకు అనుమ తి ఇస్తున్నామని పేర్కొన్నారు. డంప్ యార్డు ల్లో 43 లక్షల టన్నుల ఇసుక ఉందని, నదుల్లో పూడిక తీత ద్వారా 80 లక్షల టన్ను ల ఇసుక దొరుకుతుందని వివరించారు. మరోవైపు, ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. పంటల భీమా పథకం అమలు కోసం ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.