న్యూఢిల్లీ, నవంబర్ 14: రెప్కో హోమ్ ఫైనాన్స్ నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 15 శాతం వృద్ధిచెంది రూ. 113 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ.98 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం రూ. 173 కోట్ల నుంచి రూ. 176 కోట్లకు పెరిగినట్లు రెప్కో హోమ్ ఫైనా న్స్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. మొత్తం ఆదాయం రూ. 384 కోట్ల నుంచి రూ. 428 కోట్లకు చేరింది.
ణ మంజూరీలు 8 శాతం పెరిగి రూ. 926 కోట్లకు చేరాయని, రుణ పంపిణీలు 9 శాతం వృద్ధితో రూ. 867 కోట్లుగా నమోదయ్యాయని వివరించింది. స్థూల ఎన్‌పీఏలు 4.93 శాతం నుంచి 3.96 శాతానికి మెరుగుపడగా, నికర ఎన్‌పీఏలు 2.16 శాతం నుంచి 1.59 శాతానికి దిగివచ్చినట్లు కంపెనీ పేర్కొంది. సెప్టెంబర్ 30నాటికి తమ లోన్ బుక్ 8 శాతంపైగా పెరిగి రూ. 13,964 కోట్లకు చేరినట్లు వెల్లడించింది.