calender_icon.png 13 November, 2024 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంజీరా పైప్‌లైన్‌కు మరమ్మతులు

10-11-2024 01:26:51 AM

నగరంలో 24 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి) : నగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుంది. నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్‌| కలబ్‌గూర్ నుంచి పటాన్‌చెరు వరకు ఉన్న 1,500 ఎంఎం డయా పీఎస్పీ పంపింగ్ మెయిన్ పైప్‌నకు లీకేజీ ఏర్పడింది.

లీకేజీని అరికట్టడానికి సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ  నేపథ్యంలో నగరానికి మంజీరా నుంచి వచ్చే తాగునీటి సరఫరాను 24 గంటల పాటు బంద్ చేయనున్నట్లు వాటర్‌బోర్డు అధికారులు ప్రకటించారు.

దీంతో ఆర్సీపురం, అశోక్‌నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్టతో పాటు ట్రాన్స్‌మిషన్ డివిజన్ ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లకు నీటి సరఫరా నిలిచిపోనుంది. ఆయా ప్రాంతాల ప్రజలు గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.