11-04-2025 12:27:16 AM
నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు తాగునీటి సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉద యం 6 గంటల నుంచి రాత్రి 9 గం టల వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతందని జలమండలి అధికారులు తెలిపారు. హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేసే గోదావరి డ్రింకిం గ్ వాటర్ సప్లయ్ పథకంలో భాగం గా హైదర్‌నగర్ నుంచి అల్వాల్ వరకు ఉన్న 1200 ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్‌కు షాపూర్‌నగర్ వద్ద మరమ్మతులు చేపడుతున్నట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు.
దీంతో జలమండలి ఓఅండ్ ఎం డివిజన్ 12 (షాపూర్‌నగర్)పరిధిలో ని షాపూర్‌నగర్, సంజయ్‌గాం ధీ న గర్, కళావతినగర్, హెచ్‌ఎంటీ సొ సైటీ, హెచ్‌ఏఎల్ కాలనీ, టీఎస్‌ఐఐ సీ కాలనీ, రోడమేస్త్రీనగర్, శ్రీనివా స్ నగర్, ఇందిరానగర్, గాజుల రా మారం, శ్రీసాయి హిల్స్, దేవేందర్ నగర్, కైలాస్ హిల్స్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుంద న్నా రు.