calender_icon.png 22 September, 2024 | 1:21 PM

పాలేరు ఎడమ కాల్వ మరమ్మతులు పూర్తిచేయాలి

16-09-2024 02:33:50 AM

రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

ఖమ్మం, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): పాలేరు ఎడమ కాల్వకు పడిన గండిని సత్వరం పూడ్చాలని, పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కూసుమంచి మండలం హట్యాతం డా వద్ద జరుగుతున్న ఎడమ కాల్వ పనుల ను ఆదివారం ఆయన పరిశీలించారు. అవసరమైతే అదనంగా యంత్రాలు తెప్పించి, షిఫ్టుల వారీగా 24గ ంటల పాటు పనులు చేయించాలని సూచించారు.  కాల్వ తవ్వకం, లైనింగ్  పనులు సమాంతరంగా జరగాలని సూచించారు.

వరదలతో రాష్ట్రానికి భారీగా నష్టం వాటిల్లిందని, నాలుగైదు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి తాను కూడా ఢిల్లీ వెళ్తామన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాను కలిసి వరద సాయం అడుగుతామన్నారు. కేంద్రం త్వరగా వరద సాయం అందజేస్తుందని భావిస్తున్నామన్నారు. కేంద్రం గతంలో రాష్ట్రానికి ఇచ్చిన విపత్తు నిధులు రూ.1,300 కోట్లను బీఆర్‌ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. అంతకుముందు మంత్రి ఖమ్మం నగరంలో విస్తృతంగా పర్యటించారు. పలు గణేశ్ మండపాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి వెంట కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.