11-04-2025 12:11:26 AM
పెట్రోల్, డీజిల్ వాహనలకు అమ్మకాలు
ఉన్నతాధికారుల పర్యవేక్షణతో పునరుద్ధరణ
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 10 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని అన్నపురె డ్డిపల్లి మండల కేంద్రంలో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ లో మరమ్మతులు పూర్తయ్యా యి.
ఈనెల 1వ తేదీన విజయ క్రాంతి లో వెలువడిన ’ బంకు నిర్వాహణలో నిబంధనలు ఏవి’అనే కథనానికి స్పందించిన అధికా రులు బంకులో మరమతు పనులు చేపట్టారు. సివిల్ సప్లై డి.టి ఎన్. వెంకటేశ్వర్లు, గిరిజన సహకార సంస్థ అధికారులు, పౌర సరఫరాల అధికారులు, బంకు నిర్వాహకుల పనితీరుపై ఎలాంటి పర్యవేక్షణ చేపట్టటం లేదని ఆరోపణలు.
పెట్రోల్ బంక్ లో నా లుగు గన్నులు పనిచే యకపోవడం, చేస్తున్న గన్నులు లీకేజీ కావడంతో వినియోగదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నార ని తమ దృష్టికి రావడం తో ఉన్నత అధికారుల తో సంప్రదింపులు జరిపి మరమ్మత్తులు పూర్తిచేసి ప్రజలకు వినియోగానికి తీసుకొచ్చామ ని సివిల్ సప్లై డిటి తెలిపారు.బంకులో ఉచిత సేవలో వినియోగదారుల అనుగుణంగా ఆ టంకాలు లేకుండా అమలు చేయడం జరుగుతుందని .
రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు వెలుగులోకి తీసుకువచ్చామని జనరేటర్ మరమ్మతులు చేసి అని వేళల పెట్రోల్ డీజిల్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందన్నారు, మూత్రశాలలు విని యోగానికి అనువుగా చేశామని, అమ్మకం, కొనుగోలు రిజిస్టర్ల పక్కాగా అమలు జరుగుతున్నాయన్నారు. వాటర్ సౌకర్యం కల్పించమని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు 24 గంటలు డీజిల్, పెట్రోల్ అందుబాటు ఉంటుందన్నారు. పండ్ల పర్యవేక్షణలో గిరిజన ఫిల్లింగ్ స్టేషన్ మేనేజర్ పాపారావు, బంకు ఇన్చార్జి బాలు నాయక్, రాజేష్ ఉన్నారు.