వెల్దుర్తి, సెప్టెంబర్ 11: వెల్దుర్తి మండలం మంగళపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పారిశుద్ధ్యం లోపించడమే కాకుండా నీటి సంపు ప్రమా దకరంగా మారడంపై ‘సమస్యల ఒడిలో సర్కారు బడి’ అనే శీర్షికన ‘విజయక్రాంతి’లో ఇటీవల ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వెల్దుర్తి ఎంపీడీవో ఉమాదేవి పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి ఖదీర్‌ను ఆదేశించారు.
దీంతో పారిశుద్ధ్య సిబ్బంది బుధ వారం నీటి సంపులోని మురుగు నీటిని తొలగించి సంపునకు తాత్కాలికంగా రేకులతో కప్పు ఏర్పాటు చేశారు. అలాగే పాఠశాలలో మూత్రశాలలను, కుళాయిలను బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేసి నిల్వ నీరు లేకుండా చేశారు. ప్రమాదకరంగా ఉన్న బోరు మోటార్ కరెంట్ వైర్లను సరిచేశారు. పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న ఎం డిన చెట్టును తొలగించనున్నట్లు ఎంపీడీవో ఉమ తెలిపారు.