calender_icon.png 23 December, 2024 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంజీఎం ఆసుపత్రిని బాగు చేయండి

27-10-2024 12:00:00 AM

ఉత్తర తెలంగాణ జిల్లాలోనే ఎంతో పేర్గాంచిన వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రిలోని వివిధ విభాగాల గదుల పైకప్పులు పెచ్చులు ఊడి స్లాబ్‌ల నుంచి సలాకలు బయటకు వస్తున్నాయి. దీనివల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు, సహాయకులు, డాక్టర్లు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు. తాజాగా ఆంకాలజీ విభాగంలో ఒకేసారి స్లాబ్ పెచ్చులూడి పడింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాకుండా పెద్ద ప్రమాదం తప్పింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఆసుపత్రిలో శిథిలావస్థలో వున్న గదులను వెంటనే మరమ్మత్తు చేయాలి.

 జి.సత్యనారాయణ, కాజీపేట్