calender_icon.png 31 October, 2024 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ కమిటీ పునర్‌వ్యవస్థీకరణ

22-06-2024 12:05:00 AM

న్యూఢిల్లీ, జూన్ 21: జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ కమిటీని పునర్‌వ్యవస్థీకరిం చారు. బిహార్ డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరిని కన్వీనర్‌గా నియమిస్తూ కొత్త కమిటీని ఏర్పాటుచేసినట్టు శుక్రవారం జీఎస్టీ సెక్రటేరియట్ వెబ్‌సైట్‌లో పోస్టుచేసిన ఒక అధికారిక మెమోరాండంలో వెల్ల డించింది. పునర్నియమించిన కమిటీలో ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా, గోవా రవాణా మంత్రి మౌవిన్, రాజస్థాన్ వైద్య, ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య, కర్నాటక రెవిన్యూ మంత్రి కృష్ణ బైరె గౌడ, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్‌లు సభ్యులుగా ఉన్నారు. జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ, రేట్ల వ్యవస్థ సరళీకరణపై సిఫార్సులు చేయడం, జీఎస్టీ మినహాయింపుల జాబితా సమీక్షించడం, వస్తు సేవల పన్ను ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించడం వంటి కార్యకలాపాల్ని ఏడుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ నిర్వహిస్తుంది.