- వీడియోల్లో ఏడుస్తూ కనిపించిన దర్శన్ అభిమాని
- నిందితుడి ఫోన్ నుంచి సేకరించిన పోలీసులు
- ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఫొటోలు
బెంగళూరు, సెప్టెంబర్ 5: కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కీలకమైన ఫొటోలు బయటికివచ్చాయి. హత్యకు ముందు జరిగిన దాడి సమ యంలో వీటిని తీసినట్లు తెలుస్తోంది. అప్పటికే రేణుకాస్వామిని ఓ లారీ ముందు కూర్చొ బెట్టి దర్శన్, అతని అనుచరులు తీవ్రంగా కొట్టినట్లు కనిపిస్తోంది. వీడియోలో ఒంటిపై చొక్కా లేకుండా రేణకాస్వామి ఏడుస్తున్నాడు. మరో చిత్రంలో అతడు పడిపోయి ఉండగా చేతిపై కోసిన గాయం కనిపిస్తోంది. మీడియాకు ఈ ఫొటోలు అందడంతో వైరల్‌గా మారాయి. చార్జిషీట్‌లోనూ వీటిని చేర్చినట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఒకరి ఫోన్ నుంచి వీటిని దర్యాప్తు బృందం వెలికితీసినట్లు సమాచారం. దర్శన్‌కు పంపేందుకు ఈ ఫొటోలను తీసినట్లు పోలీసులు గుర్తించారు.
దుస్తులపై రక్తపు మరకలు
ఈ కేసులో 231 ఆధారాలు, సాక్ష్యాలతో పోలీసులు చార్జిషీట్‌ను నమోదు చేశారు. అత ని అవయవాలకు కరెంట్ షాకులు ఇచ్చి చంపినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. మరోవైపు మొదట ఈ హత్య చేసింది తామేనని లొంగిపోయిన నిఖిల్ నాయక, కేశవ మూర్తి, కార్తీక్‌కు ఈ కేసుతో ఎలాంటి సంబంధంలేదని విచారణలో గుర్తించి వారిని విడుదల చేశారు. అరెస్టయిన 17 మంది నిందితుల్లో కొందరి దుస్తులపై రేణుకాస్వామి రక్తపు మరకలు ఉన్నట్లు చెబుతున్నారు.
తల్లిదండ్రుల భావోద్వేగం
రేణుకాస్వామి చిత్రహింసలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ కావడంతో అతని తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు ఫొటోలు చూడలేకపో యానని అతని తల్లి పేర్కొనగా.. మా కన్నీళ్లతో మా చేతులు కడుక్కునేంత దుఃఖం వస్తోందని అతని తండ్రి కాశినాథ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన కొడుకు పడిన బాధనే నిందితులు అనుభవించాలని కోరుకున్నాడు. ఎలాంటి దయ లేకుండా చిత్రహింసలు పెట్టారని, అది చూస్తుంటే తట్టుకోలేకపోతున్నట్లు తెలిపారు.