calender_icon.png 25 February, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్యంపేటలో ఘనంగా రేణుకా ఎల్లమ్మదేవికి బోనాలు

19-02-2025 12:00:00 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 18, (విజయ క్రాంతి) : దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవికి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలను ఊరేగింపుగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో, శివసత్తుల నాట్య నృత్యంలతో రేణుక ఎల్లమ్మ దేవికి బోనాలను గ్రామ పురవీధుల నుండి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు.

కోరుకున్న కోరికలు తీర్చాలని అమ్మవారిని వేడుకున్నారు. 19న బుధవారం జాతర చక్కర తీర్థం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, భక్తులు, గ్రామస్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.