calender_icon.png 23 March, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణం

22-03-2025 08:54:44 PM

మునిపల్లి: మండల పరిధిలోని మన్సాన్ పల్లి గ్రామ శివారులో గల శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఘనంగా కళ్యాణం నిర్వహించారు. శనివారం మండలంలోని మన్సాన్ పల్లి గ్రామంలో ఉన్న ఆలయల వార్షికోత్సవంలో భాగంగా నాలుగు రోజు పాటు జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. రేణుక ఎల్లమ్మ కళ్యాణం పూజారులు అంగరంగ వైభంగా నిర్వహించారు. అంతకు ముందు అమ్మ వారికి బోనాలను మహిళలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఆదివారం జరిగే పూజ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ హాజరుకానున్నారని ఆలయ నిర్వాహకులు అంతారం నరసింహ గౌడ్ తెలిపారు.