30-04-2025 12:37:04 AM
సందర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
చేగుంట, ఏప్రిల్ 29 : మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడు ఆకుల మల్లేశం గౌడ్ ఆహ్వానం మేరకు జిల్లాలోని నందిపేట్ కు వెళుతున్న మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు. మల్లేశం గౌడ్ మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో గౌడ కులస్థుల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు.
కాగా ఎక్సైజ్ శాఖ తమకు వేధింపులు గురి చేస్తుందని మాజీ మంత్రికి మల్లేష్ గౌడ్ తెలుపగా సమస్య పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన శ్రీనివాస్ గౌడ్ ను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిద్ద గౌడ్, నాగ గౌడ్, ప్రవీణ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, సత్యం గౌడ్, బాలరాజు గౌడ్, రాజా గౌడ్ తదితరులుపాల్గొన్నారు.