13-03-2025 01:54:35 AM
కొత్తపల్లి మార్చి:12(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి లో జరిగిన శ్రీ రేణుకా ఎల్లమ్మ పట్నాలలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నియోజక వర్గ ఇంచార్జ్ పురుమల్ల శ్రీనివాస్ తో కలిసి పాల్గొన్నారు.గౌడ సంఘం అధ్యక్షుడు వడ్లకొండ మల్లేశం గౌడ్,ఉపాధ్యక్షుడు బుర్ర గంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ పట్నాలు ఆదివారం రోజు ప్రారంభమై బుధవారం పెద్దపట్నం మరియు ఎల్లమ్మ మునిరాజ్ ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగాయి.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని గౌడ సంఘం నాయకులు గ్రామస్తులు డప్పు సప్పుళ్లతో ఆహ్వానించి శ్రీ రేణుక ఎల్లమ్మ పసుపు బొట్టుపెట్టి సత్కరించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాంరెడ్డి రాంరెడ్డి,గౌడ సంఘం డైరెక్టర్లు బండపల్లి కొమురయ్య గౌడ్,కైరి నారాయణ గౌడ్, వడ్లకొండ నారాయణ గౌడ్, భూసారపు కొమురయ్య గౌడ్,బత్తిని శ్రీనివాస్ గౌడ్,గుర్రం ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.