13-02-2025 01:41:32 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి): దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు అంగ రంగ వైభవంగా ముత్యంపేటలో జరుపు కోవడం ఆనవాయితీగా వస్తుంది. 11న లంద కాడికి పోవుట, జోగు ఎత్తుట డప్పు వాయిద్యాలతో గౌడ సోదరులు ఊరేగిం పుగా నిర్వహించారు.
16న ఆదివారం బోనా లు, సాయంత్రం 6 గంటలకు అమ్మవారి ఊరేగింపు, 17న సోమవారం రేణుకా మాత జమదగ్ని కళ్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమం, 18న ఎల్లమ్మ బోనాలు ఊరే గింపుగా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. 19న చక్కర తీర్థం (జాతర) నిర్వహించడం జరుగుతుందనీ.
బుధవారం రాత్రి మిద్దె రామ గౌడ్ శిష్య బృందం, నర్ర సతీష్ యాదవ్ కళ బృందం, చే రేణుక ఎల్లమ్మ ఒగ్గు కథ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ, గౌడ సంఘం తెలిపారు. గౌడ సంఘం అధ్యక్షులు కె పి రామా గౌడ్ , కె లక్ష్మీనారాయణ గౌడ్, సిద్దా గౌడ్, ఉప అధ్యక్షులు , అనిల్ గౌడ్ ,క్యాషియర్ నీలం గౌడ్, ప్రధాన కార్యదర్శి పవన్ గౌడ్,గౌడ సదరు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.