02-04-2025 09:07:03 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం రోజురోజు ముదురుతోంది. ఆ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి. హెచ్‌సీయూతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సైతం ఈ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా సెలబ్రిటీలు సైతం గళం విప్పుతున్నారు.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటీ, జంతు ప్రేమికురాలు రేణు దేశాయ్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ హెచ్‌సియూ విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. ముఖ్యంత్రి రేవంత్ రెడ్డికి తను ఒక తల్లిగా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నారు. ఇప్పుడు నా వయస్సు 44 ఏళ్లు, నేను రేపోమాపో చనిపోతాను. నా బిడ్డలతో పాటు ఎంతోమంది బిడ్డలకు చాలా ఫ్యూచర్ ఉంది. ఈ అంశంపై మరొక్కసారి ఆలోచించండి అంటూ రేణ్ దేశాయ్ విజ్ఞప్తి చేవారు.
https://www.instagram.com/reel/DH6Q9tYzHg6/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==