calender_icon.png 12 January, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రముఖ సిద్ధ వైద్యుడు డాక్టర్ వెంకటాచారి కన్నుమూత

12-01-2025 01:05:27 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 11 (విజయక్రాంతి): ప్రముఖ సిద్ధ వైద్యుడు డాక్టర్ వెంకటాచారి గురూజీ (63) శుక్రవారం రాత్రి మరణించారు. అమీర్‌పేట నేచర్‌క్యూర్ దవాఖానాలో ప్రముఖ సిద్ధ వైద్యు  పేరొందిన డాక్టర్ వెంకటాచారి గురూజీ ఆయుర్వేదం, నేచర్ క్యూర్, మర్మకళ, ఆక్యూపంక్చర్ తదితర వైద్య విధానంలో అనేకమందికి ఉచిత సేవలు అందిం  ఎక్కడా నయం కాని రోగాలను సైతం బాగుచేసిన ఉత్తమ వైద్యుడిగా గుర్తింపు పొందారు.

ఈయన వైద్యసేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తమ వైద్యసేవ పురస్కారాన్ని అందజేసింది. ప్రభుత్వ నేచర్ క్యూర్ దవాఖానలో వైద్యుడిగా ఉంటూనే మరో వైపు ప్రతి ఆదివారం తూంకుంటలో ఉచిత వైద్యం చేసేవారు. రాష్ట్ర ప్రభు  అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సహా ప్రభు  పెద్దలకు విశిష్టమైన వైద్యసేవలు అందించాడు. ఈయన మరణం సిద్ద వైద్య రంగానికి తీరని లోటు అని పలువురు వైద్య నిపుణులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కరీంనగర్‌లో వెంకటాచారి అంత్యక్రియలు జరిగాయి.