ముంబై, జనవరి 9: సీనియర్ జర్నలిస్టు, చిత్రకారుడు, కవి, బాలీవుడ్ నిర్మాత, మాజీ ఎంపీ ప్రీతిష్ నంది మృతిచెందారు. దక్షిణ ముంబైలోని తన ఇంటిలో బుధవారం గుండెపోటుతో చనిపోయారు. బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జన్మించిన ఆయన పా త్రికేయ వృత్తితోపాటు వివిధ రంగాల్లో రాణించారు.
ప్రీతిష్ నంది కమ్యూనికేషన్స్ సంస్థను స్థాపించి చమేలీ, ఏక్ హసీనా, కుచ్ కట్టి కుచ్ మీఠి, బాలీవుడ్ కాలింగ్, ముంబై మ్యాట్నీ, జస్ట్ మ్యారీ డ్, అగ్లీ ఔర్ పాగ్లీ, ఆంఖే లాంటి విజయవంత చిత్రాలను, వెబ్ సిరీస్‌లను ఆయన నిర్మించారు. ప్రీతిష్ పలు పుస్తకాలను రచించారు. వివిధ భాషల్లోని సాహిత్యాన్ని అనువదించడం గమనార్హం.
సాహిత్య రంగంలో కృషి చేసినందుకు 1977లో పద్మశ్రీ, 2008లో కర్మవీర్ పురస్కార్, 2012లో ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ అవార్డులు అందుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ పనిచేశారు. 1998 నుంచి 2004 వరకు శివసేన పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. ఆయ న మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.