తెలంగాణ అడ్వకేట్ జీఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి
ముషీరాబాద్,(విజయక్రాంతి): ప్రముఖ పారిశ్రామిక వేత్త, గొప్ప మానవతావాది, పద్మవిభూషణ్ రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. టాటా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన ఎనలేని సేవలు అందించి విద్యా, వైద్య గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలందించిన మహనీయుడు రతన్ టాటా అని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలో అతికొద్ది మంది పారిశ్రామిక వేత్తల్లో రతన్ ఒకరని అన్నారు. తన మార్కులో ఇండియాకి గర్వకారణమైన వ్యక్తుల్లో రతన్ కూడా ఒకరని అన్నారు. ఉప్పు నుండి ఉక్కు వరకు విలువలు పాటిస్తూ వ్యాపారం చేయడం అందరికి సాధ్యం కాదని అన్నారు. రతన్ టాటా భారత దేశ సంపద అని పేర్కొన్నారు. రతన్ మరణాన్ని నంతాప దినంగా ప్రకటించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన మృతికి పలువురు న్యాయవాదులు సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కే. సదానందం, లింగం, ప్రదీప్ కుమార్, డి రాంరెడ్డి, ఎం.హనుమంతరావు, పి.మల్లేశం, జి.బద్రీనాయక్, ఎల్లారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అబుల్ సామి పాల్గొన్నారు.