calender_icon.png 6 April, 2025 | 10:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ కాలనీలో పిచ్చి మొక్కల తొలగింపు

05-04-2025 06:31:23 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని పాలచెట్టు సమీపంలో నూతనంగా నిర్వహించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను, చెత్తాచెదారని తొలగించారు. పట్టణంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఉందను ఇటీవల పంపిణీ చేయగా లబ్ధిదారులు చెత్తాచెదారం పిచ్చి మొక్కల నిండిపోయాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇవాళ ఇటీవల పట్టిన పర్యటనకు వచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించడం లబ్ధిదారులు తమ సౌకర్యాలను ఎమ్మెల్యేకు ఏకరువు పెట్టారు.

స్పందించిన ఎమ్మెల్యే వెంటనే చెత్తాచెదారం తొలగించాలని విద్యుత్తు తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా పట్టణానికి చెందిన నాల్గవ వార్డుకు కాంగ్రెస్ జిల్లా నాయకులు పుల్లూరి లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మహంత్ అర్జున్ కుమార్ ల ఆధ్వర్యంలో చెత్త చెదారం తొలగింపు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. త్వరలోనే ఇండ్లలో మౌళిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అనుగుణంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించడం జరుగుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఓరుగంటి సురేందర్ లు పాల్గొన్నారు.