25-03-2025 04:22:43 PM
పటాన్ చెరు: రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రాయసముద్రం చెరువులో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టారు. చెరువులో పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్క భారీగా పెరగడంతో శుద్ధి చేయాలని వాకర్స్ కార్పొరేటర్ పుష్ప నగేష్ కు ఇటీవల వినతిపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు మంగళవారం జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్ ఇతర అధికారులతో కలిసి కార్పొరేటర్ పుష్ప సొంత నిధులతో రాయసముద్రం చెరువులోని పిచ్చి మొక్కలను, గుర్రపు డెక్కను తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఓహెచ్ విజయమోహన్, ఎస్ఎస్ పవన్, రాంకీ సూపర్వైజర్ విజయ భాస్కర్ రెడ్డి, నాయకులు నవీన్ గౌడ్, కిరణ్ గౌడ్, రాములు యాదవ్, సంతోష్, శ్రీనివాస్, వాసుదేవ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.