calender_icon.png 24 April, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతులు లేని ఫ్లెక్సీల తొలగింపు: ఎస్సై రమణారెడ్డి

23-04-2025 11:35:49 PM

అనుమతి లేని ఫ్లెక్సీలపై కఠిన చర్యలు..

కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో అనుమతి లేని ఫ్లెక్సీలను బుధవారం సాయంత్రం ఎస్సై రమణారెడ్డి(SI Ramana Reddy) తొలగించారు. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ప్రశాంతి నగర్ పంచాయతీ కార్యదర్శి కృష్ణ పంచాయతీ సిబ్బందితో తొలగించారు. ఎవరైనా ఆయా పంచాయతీలలో, ఏర్పాటు చేసే ఫ్లెక్సీలను పంచాయతీ అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని, ఆ ఫ్లెక్సీల వల్ల పాదాచారులకు వాహనదారులకు ఏమైనా ప్రమాదం జరిగితే ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై రమణారెడ్డి హెచ్చరించారు.