calender_icon.png 5 January, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మసీదు ఆవరణలోని దుకాణాల తొలగింపు

03-01-2025 02:10:48 AM

  • కావాలనే తొలగించారని ఓ వర్గం ఆరోపణ
  • రాజ్‌కోట్‌లో ఉద్రిక్తత

గాంధీనగర్, జనవరి 2: మసీదు ఆవరణలోని మూడు దుకాణాల తొలగింపు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. ఘటన గుజ రాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకున్నది. గుజరాత్ వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తులు అక్రమంగా బదిలీ అయ్యాయంటూ కొందరు వ్యక్తులు నవాబ్ మసీదు ఆవరణలోని మూడు దుకాణాలను బుధవారం బలవంతంగా ఖాళీ చేయించారు.

దుకాణాల్లోని వస్తువులు, సామగ్రిని బయటకు విసిరేశారు. దీంతో ముగ్గురు దుకాణ యజమానులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురిపై కేసు నమోదు చేశా రు. ‘మా ముందు తరం వారు ప్రస్తుత దుకాణ యజమానుల కుటుంబాలకు కిరాయికి షాపులు ఇచ్చాం. ఆ కుటుంబాలు ఎంతకీ దుకాణాలను ఖాళీ చేయకపోవడంతో మేమే ఖాళీ చేయిం చాం’ అని నిందితులు పేర్కొంటున్నా రు. మరోవైపు కావాలనే తమ దుకాణాలను ఖాళీ చేయించారని అం టున్నారు.