calender_icon.png 28 February, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిట్లం బస్టాండ్‌లో ప్రైవేటు వాహనాల తొలగింపు

28-02-2025 02:10:08 AM

పిట్లం ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ పై ఈనెల 26వ తేదీన ‘ఆర్టీసీ బస్టాండ... ప్రైవేట్ ద‘ అనే పేరున ప్రచురితమైన శీర్షికపై బాన్సువాడ డిపో మేనేజర్ సరితా దేవి స్పందించారు. ఆర్టీసీ అధికారులు ప్రైవేటు వానాల తీరును పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పిట్లం బస్టాండ్ కు పంపించగా, వారు పిట్లం పోలీస్ స్టేషన్లో అక్రమంగా వానాలను నిలుపుతున్న వారిపై ఫిర్యాదు చేశారు. 

బస్టాండ్ ఆవరణలో ప్రైవేట్ వాహనాలు రాకుండా కట్టడి చేశారు. ఆర్టీసీ బస్టాండ్  ప్రాంగణంలో ఎవరు కూడా బహిరంగ మూత్ర విసర్జన చేయకుండా ఉండేందుకు  హోంగార్డును ప్రతిరోజు పర్యవేక్షించేలా నియమించారని తెలిపారు.