న్యూఢిల్లీ: బంగ్లా జాతిపిత మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఫొటోను బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం తొలగించింది. బంగ్లా అధ్యక్షుడి కార్యాలయంలో ఉన్న దేశ బంధు ఫొటోను తొలగించారు. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడేందుకు ముజీబ్ ఎన్నో పోరాటాలు చేశారు. బంగ్లా భవన్ దర్బార్ హాలులో ఉన్న ముజీబ్ చిత్రాన్ని తొలగించినట్లు మఫూజ్ అలం తెలిపారు. ఈయనే బంగ్లా అల్లర్ల వెనుక మాస్టర్ మైండ్ అని ఆరోపణలు ఉన్నాయి. ‘ఆయన ఫొటో ను దర్బార్ హాల్ నుంచి తొలగించాం. ప్రస్తు తం ప్రజలు ఆయన్ను ఎక్కడా చూడకూడదు అనుకుంటున్నారు’ అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు.