27-03-2025 07:32:41 PM
రోడ్డు భవనాల శాఖ డీఈ రవీందర్..
హత్నూర: హత్నూర మండలం పరిధిలోని కాసాల 12 వార్డులో ప్రధాన రహదారి పక్కన ఫుట్ పాత్ పై అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణ డబ్బలను తొలగిస్తామని రోడ్డు భవనాల శాఖ డీఈ రవీందర్ యజమానులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి ఫుట్ పాత్ పై నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన డబ్బల యజమానుదారులకు నోటీసులు పంచాయతీ కార్యదర్శి ద్వారా ఇచ్చి తొలగిస్తామని ఆయన అన్నారు. అసలు డబ్బల యజమానుదారులు కాకుండా కిరాయిలకు ఇచ్చి డబ్బులు సొమ్ము చేసుకోవడం సరైనది కాదని డబ్బల ముంగట సూచిక బోర్డులు కూలర్లు ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఏర్పాటు చేయడం ద్వారా యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉందని ఏది ఏమైనా అక్రమంగా ఏర్పాటు చేసిన డబ్బాలను తొలగిస్తామని ఆయన హెచ్చరించారు.