calender_icon.png 22 October, 2024 | 11:06 PM

కామన్‌వెల్త్ నుంచి హాకీ తొలగింపు!

22-10-2024 01:08:35 AM

మెల్‌బోర్న్: 2026లో గ్లాస్కో వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి హాకీ క్రీడను తొలగించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  1998 నుంచి జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో హాకీ మ్యాచ్‌లను నిర్వహిస్తూ వస్తున్నారు.

అయితే గ్లాస్కో వేదికగా జరగనున్న ఈసారి గేమ్స్‌లో నెట్ బాల్, రోడ్ రేసింగ్ గేమ్‌లను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ దృశ్యా హాకీని తొలగించాలన్న ప్రతిపాదన చేసింది. అయితే హాకీని తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలను అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ కొట్టిపారేసింది. ఒకవేళ హాకీని కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి తప్పిస్తే మాత్రం భారత్‌కు ఎదురుదెబ్బ కానుంది.

పురుషుల హాకీ జట్టు కామన్‌వెల్త్ గేమ్స్‌లో మూడుసార్లు రజతం.. రెండుసార్లు కాంస్య నెగ్గింది. ఇక మహిళల జట్టు మూడు పతకాలు నెగ్గగా.. అందులో ఒక స్వర్ణం ఉండడం విశేషం. ఇక హాకీలో ఆస్ట్రేలియా జట్టు కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఏడుసార్లు స్వర్ణాలు కైవసం చేసుకుంది.