08-02-2025 01:01:03 AM
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 7: శంషాబాద్ పట్టణంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ప్ర యూనిపోల్స్‌ను హైడ్రా అధికారులు శుక్రవా భారీ బందోబస్తు మధ్య తొలగించారు. శంషాబాద్ పట్టణంలోని జాతీయ రహదారికి ఇరువైపులా అనుమతులు తీసుకోకుండా భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా గడువు దాటినా చాలామంది రెన్యూవల్ చేయించుకోలేదు. హైడ్రా అధికారులకు వీటిపై ఫిర్యాదులు వెళ్లాయి.
అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న యూనిపోల్స్‌ను గుర్తించి భారీ బందోబస్తు మధ్య తొలగించారు. ఎయిర్‌పోర్టు రహదారి, కిషన్‌గూడ, సిద్ధాంతి, గొల్లపల్లితోపాటు పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా సుమారు 200 పైగా హోర్డింగులు ఉన్నాయి.