calender_icon.png 9 February, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూరం చెరువులో ఆక్రమణల తొలగింపు

09-02-2025 01:20:12 AM

మహేశ్వరం, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు సూరం చెరువు అక్రమణలను శనివారం తొలగించారు. గతంలో చెరువు విస్తరణ మొత్తం 60 ఎకరాలు ఉండగా.. కబ్జాదారులు దాదాపు 15 ఎకరాల వరకు కబ్జా చేసి లే అవుట్లు వేసి ప్లాట్లు చేసేందుకు చుట్టూ ప్రహారీ నిర్మించారు.

అక్రమంగా చెరువు స్థలం కబ్జా చేయడమే గాక డ్రైనేజీ పైపులైన్ల నిర్మాణం కూడా చేసినట్లు స్థాని కులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ ఈ నెల 7వ తేదీన సూరం చెరువును పరిశీలించారు.. రెవెన్యూ,ఇరిగేషన్,మున్సిపాలిటీఅధికారుతో చర్చించి రికార్డులను పరిశీలించి చెరువు కబ్జాకు గురైందని గుర్తించడంతో జేసీబీతో ఆక్రమణలను తొలగించారు.