calender_icon.png 3 December, 2024 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిల్మ్‌నగర్‌లో ఆక్రమణల తొలగింపు

10-11-2024 01:32:46 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి) : ఫిల్మ్‌నగర్‌లోని పలు ఆక్రమణలను హైడ్రా అధికారులు శనివారం తొలగించారు. ఫిల్మ్‌నగర్ రోడ్‌నంబర్ 9లో కొందరు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఫిల్మ్‌నగర్ లేఔట్‌ను పరిశీలించిన హైడ్రా అధికారులు..

రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఓ రేకుల షెడ్డుతో పాటు పక్కనే ఉన్న ఒక ఇంటి ప్రహరీని కూల్చివేశారు. వెంటనే శిథిలాలను తొలగించారు. ఆ స్థలంలో వెంటనే రోడ్డు నిర్మించాలని జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్‌జ యంతిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరారు.

ఫుట్‌పాత్ ఆక్రమణలపై కొరడా

రాజేంద్రనగర్: శాస్త్రిపురం డివిజన్‌లో  కొంతకాలంగా పలువురు ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఈ విషయం రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారుల దృష్టికి వెళ్లడంతో డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాల మేరకు టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ శనివారం సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య రోడ్డుకు ఇరువైపులా వెలసిన వ్యాపార సముదాయాలను జేసీబీలతో నేలమట్టం చేశారు.