16-03-2025 01:20:27 AM
రాజేంద్రనగర్, మార్చి 15: మణికొండలో హైటెన్షన్ విద్యుత్ తీగల కింద ఉన్న స్థలంతో పాటు నాలాను ఆక్రమించి ఏర్పా టు చేసిన రేకుల ప్రహరీని శనివారం హైడ్రా తొలగించింది. హైటెన్షన్ కరెంటు తీగల కింద ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధనలను అతిక్రమించంతో పాటు చారిత్మ్రాతక బులకాపూర్ నాలాను కూడా ఓ నిర్మాణ సంస్థ కబ్జా చేస్తున్నదని హైడ్రా క్షేత్రస్థాయిలో గుర్తించింది. ఆక్రమణలు నిర్ధారణ అవడంతో శనివారం హైడ్రా అధికారులు వాటిని తొలగించారు.