calender_icon.png 30 October, 2024 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిగడ్డ బరాజ్‌లో మట్టికట్ట తొలగింపు

06-07-2024 02:07:35 AM

  • ఎగువన వర్షాలు కురుస్తుండటంతో బరాజ్‌కు వరద పోటు 
  • 16 వేల క్యూసెక్కుల జలాలు దిగువకు వదిలేలా ఏర్పాట్లు

జయశంకర్ భూపాలపల్లి, జూలై  5 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బరాజ్ పరిధిలో చేపడుతున్న మరమ్మతులకు అను కోని ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు బరాజ్‌కు వరద తాకిడి పెరిగి ఏడో బ్లాక్‌లో సమస్య ఉత్పన్నమైనట్లు సమాచారం. 20వ ఫియర్ కింది భాగంలో ఇసుక, మట్టి గ్రౌటింగ్ కొంతమేర కొట్టుకుపోయిందని తెలుస్తున్నది. దీంతో నీటిపారుదలశాఖ అధికారులు నదిలో తాత్కాలికంగా నిర్మించిన మట్టికట్టను తొలగిస్తున్నారు. ఎగువ బరాజ్‌లో చేరుతున్న 16 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు అధికారులు ఇప్పటికే బరాజ్ పరిధిలో ఏర్పడిన పెద్ద గోతులను పూడ్పించారు. ఇలా నీటిపారుదలశాఖ అధికారులు ఆరు నెలల నుంచి ఒక్కో మరమ్మతు చేయిస్తుండగా, ఒక్కోసారి ఒక్కో అవాంతరం ఎదురవుతున్నది. అధికారులు వాటన్నింటినీ అధిగమిస్తున్నారు.