హైదరాబాద్, నవంబర్ 17(విజయక్రాంతి) : సచివాలయంలో మరమ్మతులు వేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రభుత్వం మారుపలు చేస్తోంది. ఈ క్రమంలో బాహుబలి గేటును ఆదివారం తొలగించగా.. వాస్తు మార్పులో భాగంగా రెండో గేటు నుంచి నాలుగో గేటు వరకు నేరుగా రోడ్డును వేయిస్తున్నారు. బాహుబలి గేటును ఈశాన్యంలో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
దాదాపు రూ.3.20కోట్ల వ్యయంతో ప్రభుత్వం సచివాలయంలో మరమ్మతులు చేపడుతోంది. డిసెంబర్ 9న ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు సందర్భంగా సచివాలయంలో తెలంగాణతల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. డిసెంబర్ 1 నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించడంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి.