calender_icon.png 23 December, 2024 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిడ్నీల మధ్య కణతి తొలగింపు

23-12-2024 02:39:36 AM

  1. కీహోల్ పద్ధతిలో తొలిసారి శస్త్రచికిత్స
  2. ఏఐఎన్‌యూ వైద్యుల అరుదైన ఘనత

హైదరాబాద్, డిసెంబర్ 2౨ (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు అరుదైన, సంక్లిష్టమైన క్యాన్సర్ కణతిని ఆదివారం తొలగించారు. 3.75 లక్షల మందిలో ఒకరికి వచ్చే కిడ్నీల మధ్య క్యాన్సర్ కణతిని తొలగించారు.

కొంపల్లికి చెందిన 45 ఏళ్ల మహిళ ఆస్పత్రికి రాగా.. పరీక్షలు చేసి క్యాన్సర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. సీటీ స్కాన్ చేసి చూడగా పరిస్థితి సంక్లిష్టంగా ఉందని తెలియడంతో 3డీ మోడల్ సృష్టించి పరిశీలించారు. ఇందులో రెండు కిడ్నీలు కలిసిపోయి ఉండడం, కుడివైపు కిడ్నీ ఉండాల్సిన చోట కాకుండా కటి ప్రాంతంలో ఉండటం, మరో కిడ్నీ పాన్‌కేక్ ఆకారంలో ఉండడం వంటి సమస్యలు కనిపించాయి.

అదేవిధంగా రెండు కిడ్నీల మధ్యలో కణతిని గుర్తించినట్టు రోబోటిక్ అండ్ యూరో ఆంకాలజీ విభాగం డైరెక్టర్ ఎస్‌ఎం గౌస్ తెలిపారు. డాక్టర్ మల్లికార్జున, యూరో ఆంకాలజిస్టు రాజేశ్ నేతృత్వంలో సంక్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను చేసినట్టు వారు పేర్కొన్నారు.

ఈ కేసు చారిత్రాత్మకమని గౌస్ చెప్పారు. పాన్‌కేక్ కిడ్నీల మధ్యలో ఏర్పడిన కణతిని ఇప్పటివరకు ఓపెన్ పద్ధతిలోనే తొలగించారని, కీహోల్ శస్త్రచికిత్స చేయడం ఇదే తొలిసారి అని వివరించారు. రోగి పూర్తిగా కోలుకోవడంతో మూడో రోజునే డిశ్చార్జి చేశామన్నారు.